శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (10:56 IST)

దిగివచ్చిన రామ్‌గోపాల్ వర్మ... 'వంగవీటి' రాధాకు స్పెషల్ షో

'వంగవీటి' మూవీలో పాటలో నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడటంతో ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్రమత్తమయ్యాడు. ఇకపై సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టినట్టు తెలుస

'వంగవీటి' మూవీలో పాటలో నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడటంతో ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్రమత్తమయ్యాడు. ఇకపై సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆ చిత్రం విడుదలకు ముందే వంగవీటి రాధాకు స్పెషల్‌గా షో వేసి చూపించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.
 
ఇందులోభాగంగా, శనివారం ముంబై నుంచి విజయవాడకు బయలుదేరిన వర్మ, తన జట్టుతో మాట్లాడుతూ, రాధాను కూల్ చేయాలన్న ఒపీనియన్‌ని వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. సినిమా చూసిన తర్వాతైనా రాధా కూల్ అవుతాడని భావిస్తున్నాడట. మరోవైపు శనివారం సాయంత్రం విజయవాడలో 'వంగవీటి' ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.