శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 మే 2016 (16:32 IST)

రమ్యకృష్ణ ర్యాంప్ వాక్ అదుర్స్.. అదీ రిత్విక్‌లో అలా నడుస్తూ వస్తుంటే?!

బాహుబలి, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో అదుర్స్ అనిపిస్తున్న రమ్యకృష్ణ.. తాజాగా తన కుమారుడు రిత్విక్‌తో కలిసి ర్యాంప్ వాక్‌ చేసి అదరగొట్టింది. ఒకప్పటి హీరోయిన్‌గా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలిలో దూసుకెళ్తున్న రమ్యకృష్ణ 'మామ్ అండ్ కిడ్స్' కోసం ర్యాంప్ వాక్ చేసి ప్రేక్షకులను కేరింతలు కొట్టేలా చేసింది. 
 
మామ్స్ అండ్ కిడ్స్ కోసం ఓ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమ్యకృష్ణ.. తన కుమారుడితో కలిసి ర్యాంప్ వాక్ చేసి.. మోడల్స్‌కి ధీటుగా నిలిచింది. రమ్య, రిత్విక్ కలిసి ర్యాంప్ వాక్ చేస్తుంటే.. ఆహూతులు కేరింతలు, చప్పట్లతో అభినందించారు. ఇకపోతే, పలువురు మోడల్స్ వివిధ రకాల కాస్ట్యూమ్స్‌తో ఈ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నా.. రమ్యకృష్ణ  ర్యాంప్ వాకే అదుర్స్ అనిపించడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.