శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (18:26 IST)

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రానా.. భీమ్లా నాయక్ తర్వాత?

Rana Daggubati
రానా దగ్గుబాటి నాలుగేళ్ల క్రితం అస్వస్థతకు గురికావడంతో సినిమాలను కాస్త తగ్గించుకున్నాడు. పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్"లో కీలక పాత్రతో సహా నటుడిగా అదరగొట్టాడు. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయలేదు. 
 
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం వేట్టైయన్‌లో రానా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దీంతో పాటు పలు కొత్త ప్రాజెక్టులకు కూడా రానా సంతకం చేశాడు. 
 
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్- రానా సినిమా వేట్టైయన్‌కు జై భీమ్‌ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా తేజ దర్శకత్వంలో రానా కూడా ఓ సినిమాకి సంతకం చేశాడు.