ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (15:36 IST)

'ఘాజీ' చిత్రం ట్రైలర్‌‌కు వేళాయె... ఇది యుద్ధం.. దాని గురించి మీకు తెలియదు

బాహుబలి ది ఎండింగ్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో బాహుబలి భల్లాలదేవ రానా ఘాజీ సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు. రానా హీరోగా సంకల్ప్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'ఘాజీ' చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుద

బాహుబలి ది ఎండింగ్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో బాహుబలి భల్లాలదేవ రానా ఘాజీ సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు. రానా హీరోగా సంకల్ప్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'ఘాజీ' చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా ట్రైలర్‌ విడుదలను ప్రకటిస్తూ.. తొలి పోస్ట్‌ర్‌ను పంచుకుంది. 'ఇది యుద్ధం.. దాని గురించి మీకు తెలియదు' అని ట్వీట్‌ చేసింది.
 
భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే నావికాదళ యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రమిది. భారతదేశ తొలి సబ్‌మెరైన్‌ వార్‌ చిత్రమిదేనని 'ఘాజీ' బృందం చెప్తోంది. ఈ చిత్రం త్రిభాషా చిత్రంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో తాప్సి కథానాయికగా నటించారు. కె.కె.మేనన్‌ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమమతోంది.