మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (16:34 IST)

''రంగస్థలం'' బిజినెస్ సూపర్: ఇక కలెక్షన్లు కుమ్మేస్తుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ''రంగస్థలం''. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ''రంగస్థలం''.  ఈ  చిత్రంలో సమంత హీరోయిన్.  జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్సంతా వేయికనులతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఓ రేంజ్‌లో అమ్ముడుబోయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా తెలుగు సినిమా శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు రూ.20కోట్లకు అమ్ముడుబోయినట్లు సమాచారం. 
 
ఇకపోతే... హిందీ శాటిలైట్ హక్కులు 10.50 కోట్లకు అమ్ముడైనట్టు చెప్తున్నారు. ఇలా విడుదలకు ముందే ఈ సినిమా బిజినెస్ అమాంతం పెరిగిపోతున్న తరుణంలో విడుదలయ్యాక ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో వేచి చూడాలి.