ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (12:15 IST)

రాంజ్ కథానాయకుడిగా ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఫైటర్ రాజా

Ranz, tanikella bharani, Priyadarshi,  Rahul Ramakrishna and others
Ranz, tanikella bharani, Priyadarshi, Rahul Ramakrishna and others
ఆర్టిస్ట్ అవ్వాలను కుని కాస్ట్యూమ్స్ డిజైనర్ గా అఖండ వంటి పలు సినిమాలకు పనిచేసిన రాంజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ఫైటర్ రాజా అని పేరు ఖరారు చేశారు. బుధవారంనాడు రామానాయుడు స్టూడియోలో ఫస్ట్ లుక్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి లాంఛ్ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, నాకురామ్ జీ తండ్రి మంచి స్నేహితుడు. సినిమా చేస్తున్నానుఅని దర్శకుడు క్రిష్ణ ప్రసాద్ ఫోన్ చేసి చెప్పారు. కానీ వెళ్ళాక అది పూర్తి పాత్రగా మారిపోయింది. నా పాత్ర తీరు గతంలో చేసిన శివ తరహాను పోలి వుంటుంది అన్నారు.
 
రాంజ్ మాట్లాడుతూ, నటుడి కావాలని కోరిక ఇలా నెరేరింది. ఓల్డ్ సిటీలో సెటిల్ మెంట్లు చేసే పాత్ర నాది. ఇందులో మాయ  చక్కటి పాత్ర పోషించింది. ప్రియదర్శి, రాహుల్ రామక్రిష్ణ ఎంటర్ టైన్ చేస్తారు. యూత్ ఫుల్ సినిమా ఇది త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.