క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నానా? రాశిఖన్నా ఆన్సర్ ఏంటి?

సినిమా హీరోయిన్లపై పలు రకాలైన గాసిప్స్ రావడం ఆనవాయితీ. ముఖ్యంగా, హీరోలతో ముడిపెట్టి లేనిపోని వార్తలు రాస్తుంటారు. కానీ, అందాల ముద్దుగుమ్మగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్న రాశిఖన్నాకు ఓ క్రికెటర్‌కు మధ

Rashi Khanna
pnr| Last Updated: మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:09 IST)
సినిమా హీరోయిన్లపై పలు రకాలైన గాసిప్స్ రావడం ఆనవాయితీ. ముఖ్యంగా, హీరోలతో ముడిపెట్టి లేనిపోని వార్తలు రాస్తుంటారు. కానీ, అందాల ముద్దుగుమ్మగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్న రాశిఖన్నాకు ఓ క్రికెటర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, మొన్నామధ్య ఓ క్రికెటర్ ఆట అంటే తనకు ఇష్టమని చెప్పానని... దీంతో, అతడిని ప్రేమిస్తున్నానంటూ వార్తలు పుట్టుకొచ్చేశాయని వాపోయింది. తనతో నటించేవారందరితో తనకు స్నేహపూర్వక సంబంధాలు మాత్రమే ఉంటాయని తెలిపింది. 
 
ఇలాంటి వార్తలను పుట్టించేవారు అనుకుంటున్న సంబంధాలు ఉండవని చెప్పింది. దక్షిణాదిన తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని... బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన తనకు లేదని తెలిపింది. భవిష్యత్తులో ఏదైనా మంచి అవకాశం వస్తే, బాలీవుడ్‌లో నటిస్తానేమో అని చెప్పింది. దీనిపై మరింత చదవండి :