గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (15:57 IST)

లెస్బియన్‌గా రష్మీ గౌతమ్... పార్టనర్ ఎవరో? (video)

తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. అటు బుల్లితెరపై దూసుకుపోతోంది. అలాగే, బిగ్ స్క్రీన్‌పై కూడా అడపాదడపా కనిపిస్తోంది. అయితే, ఈ అమ్మడు నటించిన నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. అయినప్పటికీ.. ఈ అమ్మడుకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 
 
మరోవైపు, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. తనపై కొంటె ప్రశ్నలు సంధించే పోకిరీలకు తగిన విధంగా సమాధానాలు ఇస్తోంది. అలాగే, పలు సామాజిక అంశాలపై తనదైనశైలిలో స్పందిస్తూ ఉంటోంది. అలాగే, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఇలాంటి రష్మీ గౌతమ్.. ఇపుడు వెబ్‌ సిరీస్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వెబ్ సిరీస్‌ హవా నడుస్తోంది. వీటికి మంచి డిమాండ్‌ ఉండటంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలన్నీ సొంత వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. ఇక అందులో నటించేందుకు అగ్ర హీరో, హీరోయిన్లు సైతం అమితాసక్తిని చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో రష్మీ కూడా ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పిందట. అయితే అందులో రష్మీ లెస్బియన్ పాత్రలో నటించనుందట. ఈ పాత్ర గురించి విన్న రష్మీ.. వెంటనే ఇందులో నటించేందుకు అంగీకరించిందట. మరి ఇందులో నిజమెంత..? లెస్బియన్ పాత్రలో రష్మి ఏ మేరకు మెప్పిస్తుంది..?, ఆమెకు భాగస్వామి ఎవరో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. 
 
కాగా, వెండితెరపై నిత్యా మీనన్, రెజీనా ఇప్పటికే లెస్బియన్ పాత్రలలో నటించారు. 'అ'! సినిమాలో నిత్యామీనన్, 'ఏక్ లడ్కీ కీ దేఖాతో ఐసా లగా' అనే హిందీ చిత్రంలో రెజీనా ఆ పాత్రలలో నటించిన విషయం తెలిసిందే.