శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (20:29 IST)

రష్మికా మందన్నా గ్లామ‌ర్‌గా మారిన ఫొటోలు వైర‌ల్‌

Rashmika Mandanna
Rashmika Mandanna
సినిమాల్లో అంద‌చందాల‌కు ప్రాధాన్య‌త పెద్ద‌గా ఇవ్వ‌ని రష్మికా మందన్నా త‌ను పెట్టుకున్న రూల్స్ ప్ర‌కారం పాత్ర‌లు పోషించేది. కానీ ఇప్పుడు రూల్ బ్రేక్ చేసిన‌ట్లుగా వ్యాపార ప్ర‌క‌ట‌న కోసం ఇచ్చిన ఫోజ్‌లు సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. నెటిజ‌న్లు చాలా ఫిదా అవుతున్నారు. అయితే ఇటీవ‌లే స‌మంత కూడా ఓ ఫొటో షూట్ చేసింది. ఇద్ద‌రినీ పెట్టి స‌మంత‌కు ధీటుగా ర‌ష్మిక అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు.
 
ఇటీవ‌లే పుష్ప విడుద‌ల‌య్యాక ఆమె బాలీవుడ్‌లోనూ ఫేమ‌స్ అయింది.  దాంతో ఇండియన్ సినిమా దగ్గర నేషనల్ క్రష్ గా కూడా నిలిచింది. తాజాగా ఫొటో షూట్‌ ప్రముఖ ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం స్టన్నింగ్ అవతార్ లోకి మారింది. ఇప్పుడు పుష్ప సీక్వెల్ చేస్తోంది. దానితోపాటు తలపతి విజయ్‌తో ఓ సినిమా కూడా చేస్తోంది.