బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (14:22 IST)

కిరాణ కొట్టు నడిపే వ్యక్తికి కూతురిగా రష్మిక...?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వేరియంట్ రోల్ ఎంచుకుంది. పుష్పలో డీ-గ్లామర్ రోల్ పోషించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా  ఒక గ్రామంలో కిరాణ కొట్టు నడిపే వ్యక్తికి కూతురుగా కనిపిస్తుందట. 
 
ఒక కిరాణా షాపు యజమాని కూతురు, బిజినెస్ విమెన్‌గా ఏ స్థాయికి ఎదిగిందనేదే కథలో కనిపించనుంది. ఇంతవరకూ ఆడిపాడే పాత్రలను చేస్తూ వచ్చిన రష్మిక, ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
 
ఈ లేడి ఓరియెంట్ పాత్ర కోసం రష్మిక బాగానే కసరత్తు చేస్తున్నట్లు సమాచాం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.
 
ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇక శర్వానంద్ జోడీగా ఆమె చేస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సెట్స్‌పై ఉంది.