గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 15 మే 2018 (10:13 IST)

విజయ్ దేవరకొండతో రష్మిక.. క్రికెట్ నేర్చుకుంటోంది.. ఎందుకు?

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన జతకట్టనుంది. ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన రష్మిక.. తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. తాజాగా

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన జతకట్టనుంది. ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన రష్మిక.. తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండతో రష్మిక నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకి, భరత్ కమ్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 
 
ఈ సినిమా షూటింగ్‌ జూన్ నుంచి ప్రారంభం జరగనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఒక క్రికెటర్‌గా కనిపించనుంది. పాత్రలో సహజత్వం లోపించకుండా ఉండటం కోసం రష్మిక ఇప్పుడు క్రికెట్ నేర్చుకుంటోంది.
 
ఇందుకోసం హైదరాబాద్ క్రికెట్ క్లబ్‌లో రష్మిక శిక్షణ పొందుతోంది. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఆమె వుంది. ఇక మలయాళంలో దుల్కర్ చేసిన ''కామ్రేడ్ ఇన్ అమెరికా'' సినిమాకి ఎలాంటి సంబంధం లేదని సినీ యూనిట్ తెలిపింది.