సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 23 అక్టోబరు 2017 (16:12 IST)

నన్ను అలా మాట్లాడిన వారికి ఇదొక చెంప దెబ్బ - రవితేజ

చాలా గ్యాప్ తరువాత అంధుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు రవితేజ. రాజా ది గ్రేట్ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు దాసోహమన్నారు. కళ్ళు కనిపించని ఒక వ్యక్తి సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనే సన్నివేశాలు ఈ సినిమాలో

చాలా గ్యాప్ తరువాత అంధుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు రవితేజ. రాజా ది గ్రేట్ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు దాసోహమన్నారు. కళ్ళు కనిపించని ఒక వ్యక్తి సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనే సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్. నిజమైన అంధుడిలాగా నటించిన రవితేజకు వందకు వంద మార్కులు ఇచ్చేస్తున్నారు ప్రేక్షకులు.
 
అయితే ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొంది సినిమా యూనిట్. విజయోత్సవ కార్యక్రమంలో రవితేజ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇక సినిమాలు చేయనోమో.. రవితేజకు ఇబ్బందులు బాగా వచ్చాయి. ఇక రవి పనైపోయింది.. ఇలా ఎన్నో మాటలు నా గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. అయితే నేను నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో నేనేంటో మరోసారి నిరూపించుకున్నా. నన్ను అలా మాట్లాడిన వారికి ఇదొక చెంప దెబ్బ లాంటివి. ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలంటూ ముగించారు. రవితేజ చేసిన ప్రసంగంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.