మంగళవారం, 2 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (16:45 IST)

గ్రామీణ మహిళలను ఎడ్యుకేట్ చేసే పనిలో రెజీనా కాసాండ్రా

Regina Cassandra with rural women
Regina Cassandra with rural women
నటి రెజీనా కసాండ్రా పరోపకారిగా మారింది.  డెమోక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. దాని ద్యారా  గ్రామీణ మహిళలను చైతన్యం చేసే దిశగా పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు నాయకత్వ లక్షణాలు పెంచే దిశగా క్లాసులు తీసుకున్నారు.  రెజీనా కాసాండ్రా  శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లెని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి పలు చిత్రాల్లో నటించారు. 2021లో 1945 అనే సినిమాలో నటించారు.  ఆ తర్వాత ఆమె సేవాకార్యకర్మల వైపు మళ్ళారు. నటిగా బ్రేక్ తీసుకోలేదని మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నట్లు చెపుతోంది. 
 
Regina Cassandra at rural school
Regina Cassandra at rural school
హైదరాబాద్ కు చెందిన ప్రజాస్వామిక సంఘ (డెమోక్రటిక్ సంఘ) కార్యకర్తలు ఇటీవలే  రాష్ట్రంలో విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి)ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 సాధారణంగా విద్యా హక్కు (RTE) చట్టం అని పిలుస్తారు, ఏప్రిల్ 1, 2010 నుండి అమలులోకి వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలు చేయడంలో నిష్క్రియాత్మకంగా వ్యవహరించడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనాని వారు చెపుతున్నారు. ఈ కార్యక్రంలో రెజినా కూడా పాల్గొంది.