మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (14:42 IST)

కాశ్మీర్‌లో ''ఖావా'' తాగుతూ రేణూ దేశాయ్- ఇంకా వదినా అంటారేంటి బాబోయ్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కాశ్మీర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. కాశ్మీర్‌ టూర్‌లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ షేర్ చేసుకుంది. కాశ్మీర్ ''ఖావా'' తాగుతూ దిగిన ఫోటో ప్ర

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కాశ్మీర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. కాశ్మీర్‌ టూర్‌లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ షేర్ చేసుకుంది. కాశ్మీర్ ''ఖావా'' తాగుతూ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరీరాన్ని కప్పే కోటు, తలకు విగ్ పెట్టుకుని చేతులకు గ్లౌజ్ ధరించి రేణూ ఆ పిక్‌లో భలేగుందని నెటిజన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. 
 
కాశ్మీరీ గ్రీన్ తేయాకు, సుగంధ ద్రవ్యాలు, కుంకుమపువ్వు, నట్స్ వంటి వాటిని కలుపుతూ, సమోవర్ అనే సంప్రదాయ ఫిల్టర్‌లో తయారు చేసే ''ఖావా''ను టేస్టు బాగుందని రేణూ దేశాయ్ తన పోస్టులో తెలిపింది. ఇక్కడ చలిని కూడా ఎంజాయ్ చేస్తున్నానని రేణూ దేశాయ్ తెలిపింది. ఇక రేణూ దేశాయ్ పెట్టిన పోస్టుకు, ఫోటోకు ''సూపర్ వదినా'' అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి. 
 
అయితే వదినా అంటూ చేసిన కామెంట్లపై ఇంకా వదినా వదినా అంటారేంటి బాబోయ్. ఆమె కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటుంటే.. ఆమెను వదిలేయండి పీకే ఫ్యాన్స్‌కు ఓ నెటిజన్ సూచించాడు. లేకుంటే పీకే ఫ్యాన్స్ వర్సెస్ వదిన అని టీవీ9 ప్రోగ్రామ్ చేస్తాడు. దానికి కత్తి మహేష్ గెస్ట్‌గా వస్తాడంటూ కామెంట్ చేశాడు.