బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (13:20 IST)

మాల్కోవా ప్రైవేట్ పార్ట్స్‌పై ''ఓం''కారాన్ని స్వరపరచడమా?: జైకుమార్ ఫైర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) లఘు చిత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా నిషేధానికి గురైనప్పటికీ.. ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మన

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) లఘు చిత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా నిషేధానికి గురైనప్పటికీ.. ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మను, సంగీత దర్శకుడు కీరవాణిని వివాదాలు, కేసులు వీడట్లేదు. ఇప్పటికే వర్మపై పోలీసు కేసులు నమోదు కాగా, ఇక సంగీత దర్శకుడు కీరవాణిపై ''సర్కార్-3'' రచయిత జైకుమార్ ఫైర్ అయ్యారు.
 
జీఎస్టీ చిత్రానికి 'ఓం' కారంను కీరవాణి స్వరపరిచారని ఆరోపించారు. భక్తి సంబంధించిన మ్యూజిక్‌ను జీఎస్టీ వంటి సినిమాల్లో పెట్టారు. సినిమా పేరు పడగానే ''ఓం'' కారం వినబడుతోందని.. ఇలాంటి వాళ్లను వదిలేస్తే మాల్కోవా వంటి వారికి గుడులు కూడా కడతారని జై కుమార్ విమర్శలు గుప్పించారు. క్రైస్తవ భక్తిగీతాలు, అయ్యప్పస్వామి భక్తి గీతాలు, నాగార్జునతో షిర్డి సాయిబాబా చిత్రాలకు సంగీతం సమకూర్చిన గొప్ప సంగీత దర్శకుడు కీరవాణి.. మియా మాల్కోవా ప్రైవేట్ పార్ట్స్‌పై ఓం కారాన్ని స్వరపరచడం బాధాకరమైన విషయమని చెప్పారు. 
 
అది ఓంకారం కాదని వారు చెప్పినా.. సినిమాలో వినబడేది మాత్రం 'ఓం' కారం కాదని చెప్పడానికి వీలు కాదని.. ఎందుకంటే.. ఓం కారం స్పష్టంగా వినబడుతుందని.. బూతు మీద శ్లోకాలేస్తే బూతు కాకుండా వుంటుందా అని జైకుమార్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విశ్వహిందూ పరిషత్ వద్దకు వెళ్తానని.. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ అధికారులను కలుస్తానని.. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని జైకుమార్ తెలిపారు.