సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (13:24 IST)

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జీఎస్టీ పాట (వీడియో)

వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) - జీఎస్టీపై భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా రూపొందించిన హోలీ పాట ఇపుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది.

వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) - జీఎస్టీపై భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా రూపొందించిన హోలీ పాట ఇపుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది. జీఎస్టీకి తోడుగా వరకట్నం గురించి కూడా ఈ సాంగ్‌లో ప్రస్తావించారు. ఈ రెండింటిపై బీహార్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 
 
దీంతో ఈ రెండింటినీ హైలైట్ చేస్తూ దినేష్ తీసిన ఈ సాంగ్ సూపర్‌హిట్ అయింది. త్వరలోనే హోలీ వస్తుండటంతో ఈ రెండు సమస్యలను దానికి లింకు పెట్టి వీడియో రూపొందించారు. దినేష్ లాలే ఈ సాంగ్‌ను పాడగా.. జీటీవీ ఫేమస్ సీరియల్స్ సాత్ ఫేరె, మాయ్కాల్లో నటించిన అమ్రపాలి దూబే ఈ సాంగ్‌లో నటించింది. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన కొన్ని రోజుల్లోనే కొన్ని లక్షల మంది వీక్షించారు.