శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (16:46 IST)

మా ఇద్దరి దారులు వేరు : కమల్‌హాసన్‌పై రజనీకాంత్

తమిళనాడు రాష్ట్రంలో త్వరలో రాజకీయ యాత్రను శ్రీకారం చుట్టనున్న సూపర్ స్టార్ కమల్ హాసన్ ఆదివారం సినీ నటుడు మరో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికెళ్లిన

తమిళనాడు రాష్ట్రంలో త్వరలో రాజకీయ యాత్రను శ్రీకారం చుట్టనున్న సూపర్ స్టార్ కమల్ హాసన్ ఆదివారం సినీ నటుడు మరో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికెళ్లిన కమల్ హాసన్‌ను రజనీకాంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. త్వరలో పర్యటన ప్రారంభించనున్న కమల్‌ని రజనీ అభినందించారు. 
 
ఈ భేటీ అనంతరం రజనీకాంత్ స్పందిస్తూ, తనది, కమల్‌ది ఇటు సినిమాలు, అటు రాజకీయాల్లో వేర్వేరుదారులని చెప్పారు. అయినప్పటికీ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో తన మిత్రుడు కమల్‌కు అన్ని విధాలుగా విజయం చేకూరాలని తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నట్టు రజనీకాంత్ చెప్పారు.