శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (08:53 IST)

రజనీకాంత్‌కు కమలనాథులు గాలం వేయొచ్చు : కమల్ హాసన్

రాజకీయాల్లోకి రానున్న సహచర సినీ నటుడు రజనీకాంత్‌పై మరో సినీ నటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ రాజకీయ పార్టీ కాషాయరంగు పులుముకుంటే ఆ పార్టీతో తాను పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని త

రాజకీయాల్లోకి రానున్న సహచర సినీ నటుడు రజనీకాంత్‌పై మరో సినీ నటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ రాజకీయ పార్టీ కాషాయరంగు పులుముకుంటే ఆ పార్టీతో తాను పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. అలాకాని పక్షంలో ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. 
 
అమెరికాలో కేంబ్రిడ్జి నగరంలోని హార్వర్డ్‌ వర్సిటీ బిజినెస్‌ స్కూల్‌ కార్యక్రమంలో తమిళ సాంప్రదాయక దుస్తులు ధోవతి, చొక్కా ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ రజనీ, తాను స్నేహితులుగానే కొనసాగుతామని, అయితే రాజకీయాలు వేరని చెప్పారు. 37 ఏళ్లుగా పరోక్షంగా రాజకీయాల్లోనే ఉంటున్నానని, గాంధీ, పెరియార్‌లా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవాడినన్నారు. ఆ ఇద్దరు నేతలను ఆదర్శంగా తీసుకుని పార్టీ పేరు ప్రకటించబోతున్నానని తెలిపారు.
 
తన రాజకీయ పార్టీ రంగు నలుపు అని, ద్రావిడమే తన సిద్ధాంతమని, ద్రావిడమంటే పార్టీలకు సంబంధించిన విషయం కాదని, అది జాతీయపరమైనదని వివరించారు. చెన్నైలోని ఓ కళాశాల కార్యక్రమంలో తొలిసారిగా సంతకం పెట్టి రాజకీయ నేతగా ప్రకటించుకున్నానని, ప్రస్తుతం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం సాక్షిగా మరోమారు రాజకీయ నేతగా గర్వంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తనను చెన్నైలో కలిసినప్పుడు తన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కోరారని చెప్పారు.