శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (11:18 IST)

కమల్ హాసన్‌తో నయనతార.. ''భారతీయుడు'' సీక్వెల్‌లో?

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.
 
తమిళంలో ఇప్పటికే అగ్ర హీరోలతో నటించిన నయనతార తాజాగా కమల్ సరసన కనిపించనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డిలో నయన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇటీవలే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సినిమా జై సింహాలో నయనతార నటించింది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నయనతార ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌తో ప్రేమలో వుందని త్వరలోనే విఘ్నేశ్‌ను వివాహం చేసుకోనుందని టాక్ వస్తోంది.