మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (13:30 IST)

పవన్ బాటలో కమల్ హాసన్.. సినిమాలొద్దు.. రాజకీయాలే ముద్దు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలో సినీ లెజెండ్ కమల్ హాసన్ కూడా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే తాను పూర్తిస్థాయి రాజకీయాల్లో వస్తానని ప్రకటించారు. పవర్ స్టార్ కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలో సినీ లెజెండ్ కమల్ హాసన్ కూడా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే తాను పూర్తిస్థాయి రాజకీయాల్లో వస్తానని ప్రకటించారు. పవర్ స్టార్ కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగేందుకు సినిమాలను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. ఏపీకి అన్యాయం జరిగిందని... విభజన సమయంలో ఏపికి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చే దిశగా ఆయన ఒత్తిడి తెస్తున్నారు. 
 
ఇదే తరహాలో తమిళనాడులోను రాజకీయాల్లోకి వచ్చిన సినీ తార కమల్ హాసన్ కూడా.. రెండు సినిమాలతో కళామతల్లికి తాను దూరమవుతానని తెలిపారు. తమిళనాడు ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నానంటూ.. భవిష్యత్తులో సినిమాలు చేయనని స్వాతిముత్యం హీరో కమల్‌హాసన్ స్పష్టం చేశారు. 
 
రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతున్నానని కమల్ హాసన్ తెలిపారు. త్వరలో పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించనున్నట్లు బోస్టన్‌లోని హార్వర్డ్ వర్శిటీలో ఇండియాటుడే న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ తెలిపారు. ఓటమి ఎదురైనా ఓడిపోయానని అనుకోను. 37 ఏళ్లుగా సామాజిక సేవ చేస్తున్నానని.. ఇప్పటికే పది లక్షల మంది కార్యకర్తలను సమీకరించినట్లు కమల్ హాసన్ తెలిపారు.