బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:36 IST)

చిరంజీవితో కుదరలేదు.. నాగార్జునతో ధనుష్ సినిమా..?

టాలీవుడ్ అగ్రహీరో, కింగ్ నాగార్జున కోలీవుడ్ యువ హీరో, దర్శకుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌తో తెరపంచుకోనున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో ధనుష్ సినిమా చేయాలనుకున్నాడని.. అయితే ఆయన డేట్స్ అ

టాలీవుడ్ అగ్రహీరో, కింగ్ నాగార్జున కోలీవుడ్ యువ హీరో, దర్శకుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌తో తెరపంచుకోనున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో ధనుష్ సినిమా చేయాలనుకున్నాడని.. అయితే ఆయన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నాగార్జునను ధనుష్ సంప్రదించాడని ఫిలిమ్ నగర్ వర్గాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ధనుష్ చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. శ్రీ తేనాండల్ ఫిల్మ్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ సినిమా పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రస్తుతం ధనుష్ మారి-2తో బిజీగా వున్నాడు. అలాగే మరో హాలీవుడ్ సినిమాలోను ధనుష్ నటిస్తుండటంతో ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకుని ధనుష్.. నాగ్‌తో కొత్త సినిమాను రూపొందించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుందని.. ఇందులో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తారని.. సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్ రోల్ చేస్తారని టాక్ వస్తోంది.