బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (13:50 IST)

సొంత డబ్బుతో అల్లుడితో సినిమా చేస్తున్న మెగాస్టార్

మెగా ఫ్యామిలీలో మరో కొత్త నటుడు వచ్చేశాడు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్‌‌ను హీరోగా కనిపించబోతున్నారు. ఇప్పటివరకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న కళ్యాణ్‌ ఒక్కసారిగా సినిమాలవ

మెగా ఫ్యామిలీలో మరో కొత్త నటుడు వచ్చేశాడు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్‌‌ను హీరోగా కనిపించబోతున్నారు. ఇప్పటివరకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న కళ్యాణ్‌ ఒక్కసారిగా సినిమాలవైపు రావడం చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. సినిమాల్లో నటించాలని ముందు నుంచి ఆసక్తిగా ఉన్న అల్లుడికి చిరంజీవి స్వయంగా అవకాశమిచ్చాడు. అది కూడా బ్యానర్‌ను మాత్రమే పెట్టి డబ్బు మొత్తం ఆయనే స్వయంగా ఖర్చు పెడుతున్నారట. 
 
సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి స్వయంగా చిరంజీవి వెళ్ళడమే కాకుండా రాజమౌళి, కీరవాణిలను తీసుకెళ్ళారు. ఈ సినిమా వారాహి బ్యానర్‌పై నిర్మిస్తుండగా, దర్శకుడిగా రాకేష్‌ శశి పరిచయం అవుతున్నారు. అలాగే కథానాయకి మాళవిక నాయర్‌ను పరిచయం చేస్తున్నారు. సంగీత దర్శకుడు యోగేష్ కూడా కొత్త వ్యక్తే. కొత్త వ్యక్తులతోనే సినిమాను తీస్తున్నారు. అయితే సినిమాకు అయ్యే ఖర్చు మొత్తం చిరంజీవే పెడుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.