శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 29 జనవరి 2018 (21:04 IST)

పవన్ కళ్యాణ్‌ చేసేది పాజిటివ్ రాజకీయమే, తితిదేలో అలా ఎందుకు జరుగుతోంది... సిపిఐ నేత రామక్రిష్ణ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు సిపిఐ నేత రామక్రిష్ణ. కేంద్ర ప్రభుత్వం ఎపికి ఇవ్వాల్సిన హోదాతో పాటు ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు సంతోషించదగ్గ విషయమన్నారు. పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు, సిపిఐ నేతల అభిప్రాయాలు ఒ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు సిపిఐ నేత రామక్రిష్ణ. కేంద్ర ప్రభుత్వం ఎపికి ఇవ్వాల్సిన హోదాతో పాటు ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు సంతోషించదగ్గ విషయమన్నారు. పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు, సిపిఐ నేతల అభిప్రాయాలు ఒకటిగా ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్‌ పాజిటివ్ రాజకీయాలవైపే వెళుతున్నారని చెప్పారు.
 
ప్రజా సమస్యలపై ఏ పార్టీ పోరాడినా ప్రజల్లో ఆ పార్టీ చిరస్థాయికి ఉండి తీరుతుందన్నారు సిపిఐ నేత రామక్రిష్ణ. ఎపిలో రాజకీయ డ్రామా జరుగుతోందని, ఎవరు అధికార పార్టీ నేతలో, ఎవరు ప్రతిపక్ష పార్టీ నేతలో అస్సలు అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. మత ప్రాతిపదికన టిటిడిలోని అన్యమతస్తులను తొలగించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అన్యమత ఉద్యోగస్తులను తొలగించకూడదని డిమాండ్ చేశారు.