రాంగోపాల్ వర్మ 'జీఎస్టీ'తో కీరవాణికి కూడా చిక్కులు
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్స్" (జీఎస్టీ) చిత్రానికి సంగీతం సమకూర్చినందుకు గాను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణికి కూడా చిక్కులు తప్పేలా లేవు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్స్" (జీఎస్టీ) చిత్రానికి సంగీతం సమకూర్చినందుకు గాను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణికి కూడా చిక్కులు తప్పేలా లేవు.
జీఎస్టీ చిత్రంలో మియా మాల్కోవా నటించగా, ఇది పూర్తిగా న్యూడ్ అండ్ వెబ్ సిరీస్ చిత్రంగా తీశారు. ఈ చిత్రంపై పలు రకాల ఫిర్యాదులే కాకుండా, పలు చానెల్స్ డిబెట్‌లో తమపై అభ్యంతర వ్యాఖ్యలుచేసి దూషించాడని సామాజిక కార్యకర్త దేవీతో పాటు మరో మహిళ ఫిర్యాదు చేయడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు.
ఈ నేపథ్యంలో జీఎస్టీ వివాదం సంగీత దర్శకుడు కీరవాణికి కూడా చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్జీవీని ప్రశ్నించిన పోలీసులు తాజాగా కీరవాణికి నోటీసులు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా జీఎస్టీ నిర్మాణంలో సహకరించిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.