గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (17:20 IST)

రాంగోపాల్ వర్మకు షాక్ : జీఎస్టీపై నిషేధం

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధానపాత్రధారిగా ఆయన తీసిన "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" వెబ్ సిరీస్ సినిమా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధానపాత్రధారిగా ఆయన తీసిన "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" వెబ్ సిరీస్ సినిమా ప్రదర్శనకు బ్రేకులు వేశారు. మహిళా సంఘాలు చేసిన ఫిర్యాదుకు తలొగ్గిన సీసీఎస్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. 
 
నిజానికి ఈ చిత్రాన్ని విదేశాలకు చెందిన వియోమి డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. దీంతో ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు ఓ ప్రతిపాదన తెచ్చారు. ఈ చిత్రం ప్రదర్శనను పూర్తిగా నిలిపివేసినప్పటికీ మూడు డాలర్లు చెల్లించి వీక్షించేలా అనుమితి ఇవ్వాలని కోరారు. అయితే, మహిళా సంఘాల ఒత్తిడితో సీఎస్ఎస్ పోలీసులు వెబ్‌సైట్ నిర్వాహకుల వినతిని తోసిపుచ్చారు.