రాజకీయనాయకుల బిల్డప్ షాట్ లు ఎలా వుంటాయో చెప్పిన కె.సి.ఆర్. రాకింగ్ రాకేష్
సినిమాల్లో బిల్డప్ షాట్ లుంటాయి. అది హీరో చేతదర్శకుడు చేయిస్తాడు. రియల్ లైఫ్ లో పొలిటీషియన్ పక్కన వుండే కార్యకర్తలు చేసేదంతా అలాంటి బిల్డప్ లే అంటూ అదెలా వుంటుందో జబర్ దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పూసగుచ్చినట్లుగా వివరించారు. తాజాగా ఆయన కెరీర్ ఎదగాలని కె.సి.ఆర్. పేరుతో సినిమా తీశాడు. షార్ట్ కట్ లో కె.సి.ఆర్. కానీ పూర్తి పేరు కేశవ చంద్ర రమావత్.
ఈ సినిమా కథ గురించి ఆయన చెబుతూ.. లంబాడీ కుర్రాడు కె.సి.ఆర్.ను స్పూర్తిగా తీసుకుని ఎలా ఎదిగాడనేది పాయింట్. చాలామంది సినిమా వద్దన్నారు. కానీ నాకు ఈ వయస్సులో తీయకపోతే ముందుముందు వయసు అయ్యాక తీయలేక పొరపాటు చేశాననే ఫీలింగ్ రాకూడదని సాహసం చేశానని అన్నారు.
ఇక ఈ సినిమాలో ప్రమోషన్ కు పలు పాట్లు పడ్డాు. విడుదలకు థియేటర్లు పెద్దగా లేవట. అయినా వున్న కొద్ది థియేటర్లలో మిగిలిన సినిమాలకు టికెట్లు దొరక్కపోతే మా సినిమాకు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఇటీవలే జరిగిన కె.సి.ఆర్. ప్రీరిలీజ్ రిలీజ్ వేడుకకు పొలిటికల్ పార్టీకి చెందిన వారితోపాటు దిల్ రాజు వంటి ప్రముఖులను పిలిచాను. కానీ ఒక్క హరీష్ రావు తప్ప ఎవ్వరూ రాలేదు. కమ్యూనిస్టులు అయితే ట్రైలర్ లో ఎర్రజెండా వుందని చూసి మేమూ వస్తామని అడిగి మరీ వచ్చారు అని తెలిపారు.
ఈ సినిమా చేస్తున్నప్పుడు పలు అడ్డంకులు కూడా వచ్చాయి. కొందరైతే ఫోన్ చేసి.. చాలా బిల్డప్ లు ఇచ్చారు. వారు ఎలాంటివారంటే.. రాజకీయనాయుడు దగ్గర వుండే అనుచరులు. ఒక చొక్కానే ఉతికి అదే వేసుకుని తెల్లటి షర్ట్ తో రాజకీయ నాయకుడు దగ్గర వుంటారు. వాటర్ అనగానే.. సార్.. అంటూ హడావుడిగా.. వాటర్ ఇస్తూ.. అదేదో తుంగభద్ర నదిని తెలంగాణాకు తెచ్చిన ఫీలింగ్ తో బిల్డర్ ఇస్తారు. అలాంటివారు రాత్రి ఇంటికి వెళ్ళాక వారి భార్య ముందు.. ఫోన్ చేసి.. ఏంరా, అరే.. మా సార్ మీద సినిమా తీసి ఫోజుకొడుతున్నావ్ రా.. నువ్వు.. అంటారు. పక్కనే వున్న భార్య అమ్మో మా ఆయన ఊరుకోడుబాబోయ్.. పెద్ద వాళ్ళతో పని అంటూ ఆమె పొంగిపోతుంది. ఇలాంటి బిల్డప్ గాళ్ళను సినిమా మేకింగ్ లో చూశాను. ప్రతి ఎం.ఎల్.ఎ.కు నేను సమాధానం చెప్పలేను. అందుకే హరీశ్ రావును కలిశాను. ఆయన పాజిటివ్ గా తీసుకుని వచ్చారు. చాలామందిని పిలిచాను ఫంక్షన్ కు రాలేదు. నేను కష్టపడి సినిమాతీయాలని తీశాను. బాగుంటే ఆదరించండి అన్నారు.