శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 మార్చి 2017 (16:35 IST)

మహేష్-మురుగదాస్ సినిమా.. యాక్షన్ సీక్వెస్‌కు రూ.3కోట్లు.. త్వరలో ఫస్ట్‌లుక్.. ప్రిన్స్ ట్వీట్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 80 శాతం సినిమా షూటి

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 80 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షెడ్యూల్ వియత్నాంలో జరుగుతోంది. ఇక్కడ థ్రిల్లింగ్తో కూడిన యాక్షన్ సీన్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సీక్వెన్స్ కోసమే రూ.3కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. 
 
తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 23వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. వియత్నాం యాక్షన్ సీక్వెస్‌కు మురుగదాస్ యూనిట్ ఏకంగా మూడు కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా భారత సినిమా చరిత్రలో అత్యధిక మొత్తాన్ని యాక్షన్ సీన్ కోసం వెచ్చించిన రికార్డును సాధించినట్లైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు ఎస్‌జే సూర్య నటిస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో మహేష్- మురుగదాస్ చిత్రానికి సంబంధించిన టైటిల్ కాని, ఫస్ట్ లుక్ కాని ఇప్పటి వరకు బయటకు రాకపోయే సరికి అభిమానులు చాలా నిరూత్సాహానికి గురవుతున్నారు. ఉగాదికి ఫస్ట్ లుక్ వస్తుందని అభిమానులు భావించినప్పటికి చిత్ర యూనిట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారట. 
 
దీనిపై స్పందించిన మహేష్ తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా కాస్త ఓపిక పట్టమని సలహా ఇచ్చాడు. ఈ సినిమా కోసం తమ యూనిట్ రాత్రింబవళ్లు కష్టపడుతుందని చెప్పాడు. త్వరలోనే మురుగదాస్‌తో తన సినిమా లుక్‌ను విడుదల చేస్తామని తెలిపాడు.