1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (13:40 IST)

రూ. ఆరు లక్షలకే అన్ని చూపించిన కుర్ర హీరోయిన్

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు జంటగా నటించిన చిత్రం "ఆర్ఎక్స్ 100". ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సె‌స్‌ను సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, ఈ చిత్రంలో హీరోయిన్ నటనప

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు జంటగా నటించిన చిత్రం "ఆర్ఎక్స్ 100". ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సె‌స్‌ను సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, ఈ చిత్రంలో హీరోయిన్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ల మధ్య షూట్ చేసిన పలు సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
 
ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే... హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తన అందచందాలతో యువ హృదయాలను మత్తెక్కించేసింది. సినిమాలో ఆమెది బోల్డ్ క్యారెక్టర్‌. పైగా నెగెటివ్ రోల్. కోరికతో రగిలిపోయే యువతిగా నటించింది. అదేసమయంలో లోలోపలే కుట్రలు చేయడం చూసి ప్రేక్షక లోకం కొత్తగా ఫీల్ అయ్యారు.
 
ఇకపోతే, ఈ చిత్రంలో లిప్‌లాక్ సీన్స్‌కి లెక్కే లేదు. లెక్కకు మించిన సీన్స్ ఉన్నాయి. అవీ కూడా గత చిత్రాల్లో ఉండేలా కాకుండా కాస్తం భిన్నంగా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సినిమాకి పాయల్ రాజ్‌పుతే స్పెషల్ అట్రాక్షన్ అయింది.
 
అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. సినిమాలో నటించేందుకుగాను పాయల్ తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం ఆరు లక్షలు మాత్రమే. అంత తక్కువ పారితోషికం తీసుకున్న ఈ బ్యూటీ కెమెరా ముందు అందాల ఆరబోతలో మాత్రం వెనకాడలేదు. పైగా తొలి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో రుజువు చేసింది. దీంతో ఈమెకు టాలీవుడ్ అవకాశాలు వరుసబెట్టడం ఖాయమంటున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు.