శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:45 IST)

'ఆర్ఎక్స్ 100' డైరెక్ట‌ర్‌కి బాగా కాలింది... ఏం చేస్తానంటుడో తెలుసా..?

'ఆర్ఎక్స్ 100' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అజ‌య్ భూప‌తి ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడో అంద‌రికీ తెలిసిందే. రెండో సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రామ్, నితిన్, ర‌వితేజ‌, చైత‌న్య‌.... త‌దిత‌ర హీరోల చుట్టూ తిరిగాడు. కానీ... ఒక్క‌రు ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు. ర‌వితేజ సినిమా చేస్తాన‌ని చెప్పి ఆఖ‌రికి మాట మార్చేసాడ‌ట‌. అంతే అజ‌య్‌కి బాగా కాలింది. అందుకే ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాడ‌ట‌.
 
'ఆర్‌ఎక్స్‌100' వంటి సంచలన హిట్‌ సినిమా తీస్తే... నాకు డేట్స్ ఇవ్వకుండా తిప్పించుకుంటారా? ఇక లాభం లేదు. హీరో వేషం వేసేయాల్సిందే అనుకుంటున్నాడ‌ట‌. ఏ హీరో కూడా నెల రోజల్లో డేట్స్‌ ఇవ్వకపోతే నేనే నటించి సినిమాని రిలీజ్‌ చేస్తానని బెదిరింపు మాటలు వదులుతున్నాడు. ఆరడగుల ఈ భీమవరం బుల్లోడు హీరోగా మారుతాడా లేక తెరవెనుకే ఉంటాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.