గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (11:54 IST)

"భారతీయుడు-2" ప్రాజెక్టును పక్కనపెట్టేసిన శంకర్.. ఎందుకో తెలుసా?

సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ తాజాగా ప్రారంభించిన ప్రాజెక్టు "భారతీయుడు-2". విశ్వనటుడు కమల్ హాసన్ నటించి సూపర్ హిట్ అయిన ఈ మూవీకి దర్శకత్వం వహించిన శంకర్.. ఇపుడు సీక్వెల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్ చేపట్టింది. 
 
అయితే, ఆదిలోనే నిర్మాణ సంస్థకు డైరెక్టర్ శంకర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అలాగే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన క్రేన్ ప్రమాదం, ఆ తర్వాత కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడినప్పటికీ.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని శంకర్ భావిస్తున్నారు. 
 
అయితే, నిర్మాణ సంస్థ బడ్జెట్‌పై పరిమితి విధించింది. నిర్ణీత బడ్జెట్ లోపే ఈ చిత్రం షూటింగును పూర్తి చేయాలన్న షరతు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇంతలోనే శంకర్‌కు వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయారు. ముఖ్యంగా, ఆయన కుమార్తె అదితి శంకర్ పెళ్లి పనుల్లో నిమగ్నమైపోయారు. అందుకే భారతీయుడు-2 ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా పక్కనపెట్టేశారని కోలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.