నటుడు కమలహాసన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు

chandrababu
వి| Last Modified శనివారం, 7 నవంబరు 2020 (17:19 IST)
ప్రఖ్యాత నటుడు కమలహాసన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కమల్ 66 ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయనకు పలువురు నేతలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కమలహాసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు ఈ మేరకు తన ట్విట్టర్లో స్పందించారు. భారతదేశ గొప్ప నటుల్లో కమలహాసన్ ఎప్పుడూ తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఉంటారు. కమల్
ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ద, ఆప్యాయత కలిగి ఉండడం ఎంతో ప్రశంసనీయం.

ఆయన ఈ పుట్టినరోజును మరింత ఘనంగా జరుపుకోవాలని, మరెన్నో దశాబ్దాల పాటు ఆయురారోగ్యం కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.దీనిపై మరింత చదవండి :