కమిషన్ల కోసం కుక్కర్తిపడి చంద్రబాబు అలా చేసారు: బొత్స సత్యనారాయణ

botsa
వి| Last Modified శుక్రవారం, 30 అక్టోబరు 2020 (20:13 IST)
పోలవరం ప్రాజెక్టు దుస్థితికి చంద్రబాబే కారణమని ఏపీ పరపాలక శాఖ మంత్రి సత్య నారాయణ విమర్శించారు. చంద్రబాబు దోపిడీ వల్లే పోలవరం ప్రాజెక్టు నిధులు తగ్గాయని కమిషన్ల కోసం కుక్కర్తిపడి చంద్రబాబు కాంట్రాక్టు తీసుకున్నారని తెలిపారు. కేంద్ర అక్కర్లేదు తామే కడతామని తీసుకున్నారని, పోలవరం ప్రాజెక్టును పాత లెక్కలకు ఒప్పుకున్నది చంద్రబాబేనని స్పష్టం చేశారు.

అయితే కేంద్రాన్ని ఒప్పించి పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సీఎం జగన్ ప్రధాని మోదీతో మాట్లాడుతారని బొత్స తెలిపారు. కోర్టుకు వెళ్లకుండా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామని తెలిపారు. పోలవరం విషయంలో రాజీపడేది లేదని తమ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోపోతే పోలవరం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు.దీనిపై మరింత చదవండి :