శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (13:40 IST)

రజినీకాంత్‌కు ఏమైంది.. నా మిత్రుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : కమల్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సుస్తి చేసింది. ఇదే విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మరో తమిళ నటుడు కమల్ హాసన్ కూడా రజినీకాంత్ ఆరోగ్యంపై కామెంట్స్ చేశారు. నా మిత్రుడు రజినీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన ప్రియమిత్రుడు రజినీకాంత్‌కు రాజకీయాల కంటే ఆరోగ్యమే ముఖ్యమన్నారు. రజినీ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వ్యక్తిగతంగా తాను కోరుకుంటున్నాని చెప్పారు. ఎన్నికల సమయంలో రజినీ మద్దతును తాను కోరుతానని చెప్పారు. అయితే, తన సొంత పార్టీని ప్రారంభించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సింది రజినీయే అని అన్నారు. మనుధర్మంపై విమర్శలు చేయడం ఇప్పుడు అనవసరమని చెప్పారు.
 
ఇకపోతే, తమ పార్టీ తమిళనాడులో బలమైన శక్తిగా అవతరిస్తుందన్నారు.  చెప్పారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే తర్వాత తమ పార్టీ అతిపెద్ద మూడో కూటమిగా అవతరిస్తుందని తెలిపారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని  బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 
 
తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు చాలా గొప్పవని... వాటికి ఆకర్షితులై ఎంతో మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి  చూపుతున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పరితపించే ప్రతి ఒక్కరికీ తమ పార్టీ స్వాగతం పలుకుతుందని చెప్పారు. తమ పార్టీని బీజేపీకి మద్దతు ప్రకటించే పార్టీగా కొందరు ప్రచారం చేస్తున్నారని... తమ పార్టీ ఏ పార్టీకి బీటీమ్ కాదని అన్నారు.