#RecordBreakingSaahoTrailer.. ఇక ఏడాదికి రెండు సినిమాలు చేస్తా!
బాహుబలి హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు అభిమానుల మధ్య భారీ అంచనాలను పెంచాయి. తాజాగా శనివారం సాయంత్రం సాహో నుంచి ట్రైలర్ విడుదలైంది. సాహో ట్రైలర్ ప్రస్తుతం రికార్డులను బద్ధలు కొడుతోంది. విడుదలైన గంటల్లోనే 30 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించింది.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా, శ్రద్ధా కపూర్ క్రైమ్ బ్యూరో ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.
ఈ మేరకు ముంబై శనివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ.. ''సాహో'' సినిమాకు తన జీవితంలోని రెండేళ్లు ఇవ్వాలని అనుకోలేదన్నాడు. ఇకపైనైనా ఏడాదికి కనీసం రెండు సినిమాలు తీయాలని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు.