శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2019 (20:34 IST)

సూపర్ స్టార్ మహేష్ జన్మదిన వేడుకలు షురూ చేసిన ఫ్యాన్స్....

ఈ నెల 9న సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదినం జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది ఆ రోజున అభిమానులు తమ అభిమాన హీరో పుట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటారు. చాలాచోట్ల మహేష్ బాబు పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
కేవలం అభిమానులు, సినిమా ప్రేమికులు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో ఉన్న నటీనటులు, దర్శకులు, మరియు ఇతర టెక్నీషియన్లు కూడా మహేష్ బాబుకి శుభాకాంక్షలు తెలుపుతారు.
 
 ఇక ఈ డిజిటల్ యుగంలో హాష్ టాగ్ వేడుకలు ప్రాచుర్యంలో ఉన్న సంగతి తెలిసిందే. హ్యాపీ బర్త్ డే మహేష్ అనే హాష్ టాగ్‌తో ఎక్కువ సంఖ్యలో ఆ రోజు తమ అభిమాన హీరోకి అత్యధిక సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతారు. సెలెబ్రేషన్స్ కోసం ఒక కామన్ డిస్ప్లే ఫోటో రెడీ చేసేసారు అభిమానులు. 
 
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మరియు సంగీత దర్శకుడు థమన్ ఈ కామన్ డీపీని ట్విట్టర్లో అభిమానుల కోసం ఆవిష్కరించారు. విడుదల చేసిన గంటలోనే #SuperstarMaheshBDayCDP తో దాదాపుగా 170 వేల ట్వీట్స్ వచ్చాయట. సూపర్ స్టార్ జన్మదిన వేడుకల్ని ఘనంగా ప్రారంభించారు అభిమానులు.