బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 జులై 2019 (14:22 IST)

యువీ పాత మెరుగు ఇన్నింగ్స్‌ను గుర్తు చేశాడుగా...

టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ టీ20 కెనడా- 2019 లీగ్‌లో ఆడుతున్న యువీ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.


గ్లోబల్ టీ20 కెనడా- 2019 లీగ్‌లో టోరంటో నేషనల్స్ టీమ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన యువీ మొదటి మ్యాచ్‌లో విఫలమైనా.. రెండో మ్యాచ్‌లో తన మెరుగు ఇన్నింగ్స్‌ను గుర్తు చేశాడు. 
 
దీంతో.. 192 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన యువరాజ్ సింగ్.. 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మొత్తం 35 పరుగులు సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలి బ్యాటింగ్ చేసిన ఎడ్మోంటన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 
 
బెన్ కటింగ్ 43, షదాబ్ ఖాన్ 36, డుప్లెసిస్ 28 పరుగులు చేశారు. 192 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన టొరంటో నేషనల్స్ జట్టు 17.5 ఓవర్లలోనే ఛేదించింది. యువరాజ్ సింగ్ (35) మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్లాసెన్ 45, యువరాజ్‌ 35 పరుగులు చేశారు. మన్‌ప్రీత్ గోనీ (33) మెరుపులు మెరిపించి జట్టును విజయం సంపాదించిపెట్టాడు.