గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (12:47 IST)

యువరాజ్ సింగ్ టీ-20ల్లో ఆడబోతున్నాడోచ్!

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ-20లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు యువరాజ్ సింగ్‌తో గ్లోబల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.


ఇటీవల భారత క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ ముంబైలో కన్నీటితో వీడ్కోలు తెలిపాడు. బాగా ఆలోచించాకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించాడు. ఆపై బీసీసీఐకి కూడా యువరాజ్ సింగ్ లేఖ కూడా సమర్పించాడు. 
 
ఈ లేఖలో టీ-20 సిరీస్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. అయితే బీసీసీఐ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ టీ-20 సీజన్‌లో ఆడేందుకు యువరాజ్ సింగ్‌కు ఒప్పందం కుదిరింది. 
 
కెనడాలో జరుగనున్న గ్లోబల్ టీ-20 సిరీస్‌లో టొరాంటో నేషనల్స్ జట్టు కోసం యువరాజ్ సింగ్ ఆడనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఆరు జట్లు కలిగిన ఈ సిరీస్‌లో ఒక్కో జట్టులో నలుగురు కెనడా క్రికెటర్లు పాల్గొంటారు. ఈ రెండో సీజన్ 25వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరుగనుంది.