శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (15:38 IST)

'తిక్క' కలెక్షన్లపై తలతిక్క లెక్కలు... 3 రోజుల్లో రూ.19.63 కోట్ల వసూళ్ళా?

మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించి, తాజాగా విడుదలైన చిత్రం "తిక్క". ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం ఓపెనింగ్స్‌తో పాటు.. తొలి మూడు రోజుల కలెక్షన్స్‌పై ఆ చిత్రం నిర్మాతలు

మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించి, తాజాగా విడుదలైన చిత్రం "తిక్క". ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం ఓపెనింగ్స్‌తో పాటు.. తొలి మూడు రోజుల కలెక్షన్స్‌పై ఆ చిత్రం నిర్మాతలు తలాతోక లేని విధంగా గణాంకాలు విడుదల చేశారు. 'తిక్క' చిత్రం తొలి మూడు రోజుల్లో ఏకంగా రూ.19.63 కోట్లు వసూలు చేసినట్టు ప్రకటించి, టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలను ఆశ్యర్యానికి గురిచేశారు. 
 
ఎందుకంటే.. సాయిధరమ్ తేజ్ సినీ కెరీర్‌లోని ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సుప్రీం చిత్రం కలెక్షన్లు లాంగ్ రన్‌లో రూ.25 కోట్లకు మించలేదు. అలాంటిది... యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న 'తిక్క' చిత్రం తొలి మూడు రోజుల్లో ఏకంగా రూ.19.63 కోట్లు వసూలు చేసిందని చెప్పడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి లోనుచేసింది.
 
ముఖ్యంగా 'తిక్క'తో పాటు విక్టరీ వెంకటేషన్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో విడుదలైన చిత్రం "బాబు బంగారం. ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. ఓపెనింగ్ కలెక్షన్లు యావరేజ్‌గా ఉన్నాయి. అలాంటిది 'తిక్క' చిత్రం మాత్రం భారీగా వసూళ్లు సాధించిందని నిర్మాతలు చెప్పడం కాస్తంత విడ్డూరంగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ చిత్రం రూ.7 లేదా రూ.8 కోట్లకు మించి వసూళ్లు రాబట్టి ఉండదన్నది ఫిల్మ్ వర్గాల టాక్.