గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (15:01 IST)

సోషల్ మీడియాలు షేక్ చేస్తున్న ''సారంగ దరియా''

అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల తెరక్కిస్తున్న చిత్రం లవ్‌స్టోరీ. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, తాజాగా సారంగ దరియా అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 
ప్రముఖ గేయ రచయిత ఆశోక్‌తేజ సాహిత్యం అందించారు. సీహెచ్ పవన్ సంగీత దర్శకత్వంలో గాయని మంగ్లి ఈ పాటను ఆలపించింది. సాయిపల్లవి ఎప్పటిలాగానే తన డ్యాన్స్‌తో ఫిదా చేసింది. ఈ పాట వీడియో ఇప్పటికి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అలాగే 5 లక్షలకు పైగా లైక్‌లు దక్కించుకుంది.
 
కాగా ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
మరోవైపు, 'వచ్చిండే..', 'రౌడీ బేబీ' పాటలతో యూట్యూబ్‌ను షేక్ చేసిన 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి తాజాగా 'సారంగ దరియా'తో మరోసారి సత్తా చాటుతోంది. ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.