సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (18:26 IST)

బెంగాలి మీస‌క‌ట్టు‌తో నాని 'శ్యామ్ ‌సింగ రాయ్`లుక్‌

Nani's Shyam Singha Roy First Look
టాలెంటెడ్ యాక్ట‌ర్‌, ఇంకో స‌మ‌ర్థుడైన డైరెక్ట‌ర్ క‌లిస్తే, ఒక మాగ్న‌మ్ ఓప‌స్ లాంటి సినిమా వ‌స్తుందంటారు. నాని, డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న 'శ్యామ్ ‌సింగ రాయ్' అలాంటి అద్వితీయ చిత్రంగా రూపొందుతోంద‌నే న‌మ్మ‌కం అంద‌రిలోనూ క‌లుగుతోంది. ఒక విల‌క్ష‌ణ క‌థ‌తో తీస్తున్న ఈ మూవీలో ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని గెట‌ప్‌లో నాని క‌నిపించ‌బోతున్నారు. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నాసెబాస్టియ‌న్ లాంటి ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ మూవీని వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.
 
ఫిబ్ర‌వ‌రి 24 నాని బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని చిత్ర బృందం 'శ్యామ్ ‌సింగ రాయ్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆ పోస్ట‌ర్‌లో ఒక బెంగాలీ యువ‌కుని గెట‌ప్‌లో నాని స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఆయ‌న మీస‌క‌ట్టు, హెయిర్ స్టైల్ విల‌క్ష‌ణంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌లో రాయ‌ల్ ప్రెస్‌, ప‌క్క‌నే రిక్షా బండిని చూస్తుంటే ఈ మూవీ ఒక పీరియ‌డ్ డ్రామా అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మేమంటే నానిని వెన‌క నుంచి ఒక యువ‌తి గ‌ట్టిగా కౌగ‌లించుకుంది కానీ, ఆమె ముఖం అస‌లు క‌నిపించ‌డం లేదు. ముగ్గురు హీరోయిన్ల‌లో ఎవ‌రు ఆయ‌న‌ను కౌగ‌లించుకున్నార‌నే విష‌యాన్ని మ‌న ఊహ‌ల‌కి వ‌దిలేశాడు ద‌ర్శ‌కుడు. అయితే ఆ పోస్ట‌ర్ ప్ర‌కారం 'శ్యామ్ ‌సింగ రాయ్' ఒక విల‌క్ష‌ణ‌ ల‌వ్ స్టోరీ అనే విష‌యాన్ని ఊహించ‌వ‌చ్చు.
 
అపూర్వ‌మైన క‌థ‌తో రూపొందుతోన్న ఈ సినిమాని యాక్ట‌ర్లు, టెక్నీషియ‌న్లు ఒక స్పెష‌ల్ ఫిల్మ్‌గా న‌మ్మి వ‌ర్క్ చేస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లోనే ఆ విష‌యం సినిమాకు ప‌నిచేస్తున్న వారంద‌రికీ అర్థ‌మైపోయింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌క‌తాలో జ‌రుగుతోంది. ఈ భారీ షెడ్యూల్‌లో హీరో, ముగ్గురు హీరోయిన్లు స‌హా ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు. అక్క‌డ ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను తీస్తున్నారు.
 
నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి స‌త్య‌దేవ్ జంగా ఒరిజిన‌ల్ స్టోరీని అందించారు. మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్‌గా పేరుపొందిన మిక్కీ జె. మేయ‌ర్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, సాను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.