1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (09:57 IST)

లింగ నిర్థారణ పరీక్షలా? సెన్సేషన్ కోసం మీడియా అల్లిన కట్టు కథ: కరీనా కపూర్

త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న కరీనా కపూర్ లింగ నిర్థారణ పరీక్షలు చేయించుకున్నట్టు వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. నేనేంటీ.. లింగ నిర్థారణ పరీక్షలు చేయించుకోవడమేంటనీ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక

త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న కరీనా కపూర్ లింగ నిర్థారణ పరీక్షలు చేయించుకున్నట్టు వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. నేనేంటీ.. లింగ నిర్థారణ పరీక్షలు చేయించుకోవడమేంటనీ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
 
దశాబ్దం కాలంపాటు బాలీవుడ్‌ తెరపై అగ్ర హీరోయిన్‌గా వెలుగొంది, స్టార్‌‌హీరో సైఫ్‌ అలీఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా.. వైవాహిక జీవితంలో స్థిరపడిపోయింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో చెలరేగిన వివాదాలు కరీనాను తీవ్ర కలవరపాటుకు గురిచేశాయట.
 
కరీనా, సైఫ్‌ దంపతులు మగబిడ్డ కావాలనుకుంటున్నారని, అందుకే ఇటీవల లండన్‌ వెళ్లి సెక్స్‌ డిటర్మినేషన్‌ టెస్ట్‌ (లింగ నిర్థారణ పరీక్ష) చేయించుకుని వచ్చారని బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. అయితే ఇదంతా అబద్ధమని కరీనా స్పష్టం చేశారు. 
 
'ఈ వార్త ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. సెన్సేషన్‌ కోసం ఎవరో అల్లిన కట్టు కథ ఇది. నేను అలాంటి పరీక్షలేవీ చేయించుకోలేదు. ఈ విషయమై లండన్‌లో ఏ డాక్టర్‌నూ సంప్రదించలేదు. దయచేసి ఇలాంటి అసంబద్ధ ప్రచారాలను ఆపేయండ'ని ఆమె కోరింది.