గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (20:32 IST)

సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులు.. బాక్సర్ నిఖత్ జరీన్ కల నెరవేరింది..! (video)

Nikhat Zareen_Salman
Nikhat Zareen_Salman
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు వీరాభిమాని అయిన బాక్సర్ నిఖత్ జరీన్ కల నెరవేరింది. తాజాగా ఆమె 1991లో విడుదలైన 'లవ్' చిత్రం నుండి బాలీవుడ్ సూపర్‌స్టార్ ఐకానిక్ నంబర్ 'సాథియా తూనే క్యా కియా'ని స్టెప్పులేశారు. 
 
నిఖత్ జరీన్ 2011 AIBA మహిళల యూత్ అండ్ జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. జరీన్ 2022 IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ పసిడి సంపాదించుకుంది. తద్వారా IBA ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళగా నిలిచింది. 
 
జరీన్ జూన్ 2021 నుండి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆమె బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
 
కాగా సల్మాన్, రేవతి జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లవ్'. తెలుగులో వచ్చిన 'ప్రేమ' చిత్రానికి ఇది రీమేక్‌. మేకర్స్ అసలు చిత్రం నుండి విషాదకరమైన క్లైమాక్స్‌ను సుఖాంతంతో మార్చారు. 
 
ఈ సినిమాలోని 'సాథియా తూనే క్యా కియా' అనే రొమాంటిక్ సాంగ్ కూడా గుర్తుండిపోతుంది. ఈ పాటకు ప్రస్తుతం సల్మాన్, నిఖత్ జరీన్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.