సల్మాన్ ఖాన్ తండ్రి కాబోతున్నాడు.. అదీ 13 ఏళ్ల అమ్మాయికి?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి కాబోతున్నాడు. ఇదేంటి? బ్రహ్మచారి ఎలా తండ్రి అవుతాడని షాక్ అవుతున్నారు కదూ.. అయితే చదవండి. ‘దంగల్’లో అమీర్ ఖాన్ ‘హానికారక్ బాపూ’గా నటించి ప్రశంసలు పొందుతున్నాడు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి కాబోతున్నాడు. ఇదేంటి? బ్రహ్మచారి ఎలా తండ్రి అవుతాడని షాక్ అవుతున్నారు కదూ.. అయితే చదవండి. ‘దంగల్’లో అమీర్ ఖాన్ ‘హానికారక్ బాపూ’గా నటించి ప్రశంసలు పొందుతున్నాడు. సల్మాన్ ఖాన్‌కు ఇదే స్ఫూర్తినిచ్చినట్లుంది. తన తదుపరి చిత్రంలో 13 ఏళ్ళ బాలికకు తండ్రిగా నటించబోతున్నాడని తెలిసింది.
ఈ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. తాను 30ఏళ్ల వయస్సున్నప్పుడే ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’లో తండ్రి పాత్ర పోషించాను. ప్రస్తుతం 13ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించబోతున్నట్లు చెప్పాడు. ఇది నాట్యం నేపథ్యంలో సాగే చిత్రం. నృత్య కారుడిగా కనిపించబోతున్నా. దీనికోసం ఎంతో శ్రమించాల్సి వుంటుంది. సుల్తాన్ కూడా శ్రమతో కూడుకున్నదే. నేను 18 కేజీల బరువు కోల్పోయాను.
ఇంట్లో తిండి మాత్రమే తిన్నాను. రుచి కోసం తినను. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు తగినన్ని రాగానే భోజనం టేబుల్ దగ్గర నుంచి లేచిపోయేవాడినని సల్మాన్ ఖాన్ తెలిపాడు. 18 కిలోల బరువు కోల్పోవడం అనేది అంత ఈజీ కాదని చెప్పుకొచ్చాడు.