శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 మార్చి 2025 (20:09 IST)

ఆత్మహత్య చేసుకుంటే ప్రియురాలు ఒంటరిదైపోతుందని...

afan
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళలోని వెంజరమూడు ఘటనలో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. ప్రేయసి సహా నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన ఉదంతంలో కీలక విషయాలను తాజాగా పోలీసులు బయటపెట్టారు. రూ.65  లక్షల అప్పే ఈ హత్యకు అఫాన్‌ను పురిగొల్పిందని తెలిపారు. అంతేకాదు వరుస హత్యలకు పాల్పడిన నిందితుడు వాస్తవానికి ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 
 
వెంజరమూడుకు చెందిన అఫాన్ (23) కుటుంబానికి దాదాపు రూ.65 లక్షల అప్పు ఉంది. 14 మంది ప్రైవేటు వ్యక్తులు తరచూ అప్పు తిరిగి చెల్లించాలంటూ వేధిస్తుండేవారు. అఫాన్ తండ్రి సౌదీలో ఉంటున్నాడు. స్థానికంగా అప్పుల వాళ్ల ఒత్తిడిని అఫాన్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో బాబాయ్, పిన్ని, నాన్నమ్మ ఏమాత్రం సాయం చేయకపోవడంతో వారిపై పగ పెంచుకున్నాడు. అప్పుల వారి ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్యే శరణ్యమనే నిర్ణయానికి వచ్చాడు. తల్లి, సోదురుడుతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని ప్రతిపాదిస్తే అందుకు తల్లి నిరాకరించడంతో హత్యలకు ప్రణాళిక రచించాడు. తల్లిని, సోదరుడుని చంపేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. 
 
అందుకే తొలుత అఫాన్.. తల్లిపై దాడి చేసి ఆమె చనిపోయిందని భావించి నాన్నమ్మ ఇంటికెళ్లాడు. ఆపై ఆమెను చంపేసి ఆమె దగ్గర బంగారం గొలుసును అపహరించాడు. ఆపై బాబాయ్, పిన్ని ఇంటికెళ్లిన అఫాన్ వారినీ హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాక ఇంట్లో ఉన్న 13 యేళ్ల తమ్ముడుని, తన ప్రేయసి ఫర్సానానూ అంతమొందించాడు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరైపోతుందన్న ఉద్దేశంతో తన కుటుంబంతో సంబంధం లేకపోయినా ప్రియురాలిని హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
కేరళలో వరుస హత్యలో చికిత్స పొందుతున్న అఫాన్ తల్లి తాజాగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తనపై అఫాన్ దాడి చేయలేదని, తానే మంచి మీద నుంచి పడిపోయానని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి తన కుమారుడు ఏం చేశాడన్న విషయం ఆమెకు ఏమాత్రం తెలీదని పోలీసులు పేర్కొన్నారు. సౌదీలో ఉన్న అఫాన్ తండ్రి రహీమ్ కూడా సౌదీ నుంచి తిరిగొచ్చాడు. తన కుటుంబ అప్పులు ఈ స్థాయిలో ఉన్నట్టు తనకు తెలియదని పేర్కొనడం గమనార్హం.