అనుమానంతో భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. భార్య ప్రవర్తనను అనుమానించిన భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రేవేంద్రపాడు గ్రామానికి చెందిన శ్రావణి, సురేష్ అనే దంపతులు ఉన్నారు.
సురేష్ హైదరాబాద్ నగరంలో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే రేవేంద్రపాడుకు మకాం మార్చాడు. ఈ క్రమంలో బుధవారం భార్య శ్రావణిని హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బూతుల ఎన్‌సైక్లోపీడియా పోసాని కృష్ణమురళి పాపం పండిందా?
తెలుగు సినీ నటుడు, దర్శకుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఆయనను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను వ్యక్తిగతంగాను, వారి కుటుంబ సభ్యులను అసభ్యపదజాలం, బూతులతో దూషించిన కేసులో ఆయనను అరెస్టు చేశారు. దీంతో పోసాని పాపం పండిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా పోసాని కృష్ణమురళి పేరు వింటేనే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంటుంది. ఆయన నోరు తెరిస్తే పచ్చి బూతులు డ్రైనేజీలో మురికిలా అనర్గళంగా ప్రవహిస్తూనే ఉంటాయి. అసభ్య పదజాలానికి ఫ్యాంటు, షర్టూ వేస్తే అది పోసాని కృష్ణమురళి అని చెబుతుంటారు.
ఆయన పేరుకు సినీ రచయిత, దర్శకుడు, నటుడు కూడా. ఆయన సినిమాల్లో నీతులు చెబుతుంటారుప. కానీ, మైకు దొరికితే చాలు పచ్చి బూతులతో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా, వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు చెలరేగిపోయాడు. పదవుల కోసం విచక్షణ మరిచిపోయాడు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును, సినీ నటుడు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లను వారి కుటుంబ సభ్యులపై పచ్చి బూతులతో చెలరేగిపోయాడు.
కానీ, ఎంతగా తిడితే జగన్ దగ్గర అన్ని మార్కులు పడతాయన్న ఉద్దేశ్యంతో నోటికి అడ్డూ అదుపూ లేకుండా విరుచుకుపడ్డాడు. సైకో వెధవా, దరిద్రపు.. దొంగ... లోఫర్, బేవార్స్, తాగుబాతు, తిరుగుబోతు, ఆంబోతు ఇవన్నీ పోసాని తిట్ల దండకంలో అతి సాధారణమైన బూతులు. రాయడానికి వీల్లేని అత్యంత అభ్యంతరకరమైన భాషతో అప్పటి ప్రతిపక్ష నాయకులను తిట్టిపోశారు. పోసాని ప్రెస్మీట్ టీవీల్లో వస్తుందంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలున్న ఇళ్ల వెంటనే చానెల్ మార్చేయడమో లేదా టీవీ కట్టేయడమో జరిగేది. ఆయన ఎంత నీచంగా మాట్లాడేవారంటే అంత నీచంగా మాట్లాడేవారు. బూతుల ఎన్‌సైక్లోపీడియాగా గుర్తింపు పొందారు.