బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2017 (14:52 IST)

''నా సూపర్ బ్రదర్" ఇతనే: సమంత

సినీ నటుడు నాగచైతన్యను సమంత అక్టోబరులో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. పెళ్ళి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత తన ట్విట్టర్ పేజీలో రానాతో కలిసివున్న ఫోటోను పోస్టు చేసింది. ఇంతవరకు

సినీ నటుడు నాగచైతన్యను సమంత అక్టోబరులో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. పెళ్ళి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత తన ట్విట్టర్ పేజీలో రానాతో కలిసివున్న ఫోటోను పోస్టు చేసింది. ఇంతవరకు రానా గురించి పెద్దగా మాట్లాడని సమంత ఉన్నట్టుండి రానా పెద్ద కటౌట్ ఫోటోను పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. 
 
అంతేగాకుండా ''నా సూపర్ బ్రదర్" అంటూ కామెంట్ చేయడం షాక్ ఇచ్చింది. నాగచైతన్యకు బంధువు, బావ వరస అయ్యే రానా సమంతకు సోదరుడు అవుతాడు. అందుకే ఆమె తన సూపర్ బ్రదర్ రానా అంటూ కామెంట్ జత చేసిందని సినీ పండితులు అంటున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది.
 
ఇక టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతల వివాహం ఈ అక్టోబర్‌ 6న గోవాలో వైభవంగా నిర్వహించనున్నారు. అయితే ఈ వివాహం కోసం అటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, ఇటు సమంత ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
 
అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు వీరి వివాహం ఘనంగా నిర్వహించనున్నారట. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో వీరి వివాహం జరగనుంది. దాంతో రెండు ప‌ద్ధతుల్లో రెండు సార్లు పెళ్లి చేసుకుటుండ‌డం విశేషం.