గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (11:33 IST)

''రాజుగారి గది 2''ని బాగా ప్రమోట్ చేస్తున్న మామ-కోడళ్లు.. సమంత లుక్ షేర్ చేసేసింది..

'రాజుగారి గది 2' షెడ్యూల్ మొదలైంది. పీవీపీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఓంకార్‌. నాగార్జున, ఆయన కాబోయే కోడలు సమంత ఈ సినిమా షూటింగ్‌‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అఖిల్ మ్యారేజ్ క్యా

'రాజుగారి గది 2' షెడ్యూల్ మొదలైంది. పీవీపీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఓంకార్‌. నాగార్జున, ఆయన కాబోయే కోడలు సమంత ఈ సినిమా షూటింగ్‌‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వ‌డంతో నాగార్జున డిస్ట్ర‌బ్డ్‌ కావటం, దానికి తోడు 'ఓం న‌మో వెంక‌టేశాయ‌' ప‌రాజ‌యం క‌ల‌త‌కు కార‌ణ‌మైంది. దీంతో కొన్ని వారాలు రిలాక్స్ అయన నాగ్  ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.
 
తాజాగా రాజుగారి గది 2' ఫిల్మ్ హంగామా మొదలైంది. లేటెస్ట్‌గా సమంత తన లుక్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది. బ్లాక్ కలర్ చుడీదార్‌తో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించింది. పోస్టర్‌లో తన హాఫ్‌లుక్‌ను మాత్రమే బయటపెట్టింది. పూర్తి రూపం మాత్రం రివీల్ చేయలేదు. నాగార్జున సూచన మేరకే ఇలా చేసుంటుందని అంటున్నారు. ఇందులో నాగ్ ఎదుటివారి మానసిక స్థితిగతుల్ని అంచనా వేయగల రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాను మామా-కోడళ్లు బాగానే ప్రమోట్ చేస్తున్నారంటున్నారు సినీ జనం.