శుక్రవారం, 18 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (09:26 IST)

నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె పెళ్ళికి చైతూ, సమ్మూ జంటగా వచ్చారోచ్: ఇక పెళ్లి భాజాలేనా..?

నాగచైతన్య, సమంత పెళ్ళి వేడుకకు అంతా సిద్ధమైనట్లు సంకేతాలు వచ్చేశాయి. టాలీవుడ్ అందాల జంట.. చైతూ, సమ్మూ ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త న

నాగచైతన్య, సమంత పెళ్ళి వేడుకకు అంతా సిద్ధమైనట్లు సంకేతాలు వచ్చేశాయి. టాలీవుడ్ అందాల జంట.. చైతూ, సమ్మూ ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతికి, ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ యజమాని శివకుమారెడ్డి కుమారుడు ప్రణవ్‌రెడ్డికి ఆదివారం అట్టహాసంగా వివాహం జరిగింది.
 
ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ అందాల జంట ప్రత్యక్షమైంది. చైతూ, సమంతలతో పాటు నాగసుశీల తదితరులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు చైతూ, సమంతనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వాటికి అవుననో, కాదనో వారు తేల్చిచెప్పలేదు. 
 
సమంత తన మెడలో "ఎన్" అనే అక్షరం లాకెట్‌ ధరించి, తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని చెప్పడం తప్ప ఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.