బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 16 జులై 2019 (18:23 IST)

నాగచైతన్యకు సమంత షాక్... ఏమైంది..?

నాగచైతన్యే నా లోకమంటోంది సమంత. అంత లవ్ బార్ ఇద్దరిది. అయితే వెండితెరపై మాత్రం భర్త రికార్డులకు చెక్ పెడుతోంది సమంత. చైతన్య కలెక్షన్లను దాటేసింది బేబీ. సమంత నటించిన ఓ బేబీ సూపర్ హిట్. తెలుగులో కాదు అమెరికాలో కూడా దుమ్ము రేపుతోంది ఓ బేబీ.
 
పెద్ద హీరోల సరసన చేరిపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జనతా గ్యారేజ్, మనం వంటి సినిమాలతో మిలియన్ డాలర్ల రికార్డులను చూపించింది సమంత. రెండో వారానికి అమెరికాలో ఓ బేబీ సినిమా 8,60,000 డాలర్లను సంపాదించింది. మరో లక్షా 40 వేల డాలర్లు ఆర్జిస్తే ఒన్ మిలియన్ మార్క్ దక్కుతుంది. ఆ రేంజ్‌లో ఓ బేబీ వసూళ్లను అందుకుంటోంది. అయితే ఇప్పటికే తన భర్త నటించిన ప్రేమమ్ సినిమా వసూళ్ళను దాటేసింది ఓ బేబీ.
 
నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమా అమెరికాలో బిగ్ హిట్. ఆ సినిమా రికార్డ్‌ను అధిగమించేసింది సమంత. భర్త రికార్డ్‌ను బ్రేక్ చేయడం తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అమెరికాలో కూడా ఇదే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.