1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (19:06 IST)

బంగారు గుడ్డులో సరికొత్తగా సంపూర్ణేష్ బాబు

bangaru guddu poster
bangaru guddu poster
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా గోపీనాథ్ నారాయణమూర్తి దర్శకత్వంలో న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ,  పీవీఎస్ గరుడ వేగ లాంటి సూపర్ హిట్ అందించిన జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్స్ పై కేఎం ఇలంచెజియన్ & ఎం. కోటేశ్వర రాజు తెలుగు, తమిళ ద్విభాష చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'బంగారు గుడ్డు' అనే క్యాచి టైటిల్ పెట్టారు.  
 
మంచి భావోద్వేగాలతో కూడిన వినోదంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యిరియాసిటీని పెంచింది. వాలంటైన్స్ డే రోజున టైటిల్ లుక్ ని ఎందుకు విడుదల చేశామో సినిమా చూసినప్పుడే ప్రేక్షకులకు అర్ధమౌతుందని దర్శకుడు చెప్పారు.
 
సంపూర్ణేష్ బాబు బాబుతో పాటు  కామెడీ కాదల్ రోబో శంకర్, సురభి శుక్లా, మొట్టై రాజేందర్, చరణ్‌రాజ్, దువ్వాసి మోహన్, సురేఖా వాణి, లొల్లు సభ మారన్, లొల్లు సభ శేషు, లొల్లు సభా మనోహర్, రాములు ఇతర కీలక పాత్రలు పోహిస్తున్నారు. అలనాటి హీరోయిన్ కిరణ్, సంగీత దర్శకుడు షమీర్ టాండన్ ట్యూన్ చేసిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్ తో రీఎంట్రీ ఇస్తున్నారు.
 
ప్రముఖ గీత రచయిత కబిలన్ కొన్ని చాలా మంచి సాహిత్యాన్ని రాశారు. రాకేందు మౌళి తెలుగులో లిరిక్స్ అందిస్తున్నారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డైరెక్టర్ రైటర్ మోహన్ తెలుగు డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి అఖిల్ శశిధరన్ సినిమాటోగ్రఫీ అందించారు.
 
తారాగణం:“బర్నింగ్ స్టార్” సంపూర్ణేష్ బాబు, సురభి శుక్లా, రోబో శంకర్, చరణ్ రాజ్, దువ్వాసి మోహన్, మొట్టా రాజేందర్, లొల్లు సభ మారన్, లొల్లు సభ మనోహర్, లొల్లు సభ శేషు, సురేఖ వాణి, రాములు, కిరణ్ తదితరులు